రాష్ట్రీయం

అగ్ని ప్రమాదంలో జీడిపిక్కలు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, నవంబర్ 21: అగ్ని ప్రమాదంలో 2 కోట్ల రూపాయల విలువైన జీడిపిక్కలు దగ్ధమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం తెల్లవారుజామున ఓ జీడిపిక్కల గోడౌన్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. విదేశాల నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే జీడి పిక్కలను కొనుగోలు చేసి పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోని పలు గోడౌన్‌ల్లో నిల్వ చేస్తుంటారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన గోడౌన్‌లో కూడా అదే విధంగా జీడి పిక్కలు నిల్వచేశారు. తెల్లవారుజామున గోడౌన్ నుంచి పొగలు రావటాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు.. యజమానికి సమాచారం అందించాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సుమారు 6 గంటల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 2 వేల బస్తాలు దగ్ధమయినట్టు యజమాని మల్లా మనోజ్ తెలిపారు.