లక్క్ ఛన్స్ దక్కింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమధ్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బుజ్జిగాడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బెంగుళూరు ముద్దుగుమ్మ సంజన. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన ఈమెకు కెరీర్ పరంగా సరైన బ్రేక్ రాలేదు. తాజాగా ఈ భామకు లక్క్ ఛన్స్ దక్కిందని చెప్పాలి. ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రంలో సంజనకు ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం గుజరాత్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ నటిస్తోంది. మరోవైపు ఓ ఐటెమ్ సాంగ్‌లో లక్ష్మీరాయ్ నర్తించింది. బాబి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సంజనకు కీలకపాత్రే దక్కిందట. కనిపించేది కొద్దిసేపే అయినా ఆ పాత్ర కథకు కీలకమని తెలిసింది. పవన్‌కళ్యాణ్ సినిమాలో అవకాశం రావడంతో ఎగిరి గంతేసిందట ఈ భామ. మరి సర్దార్ సినిమాతో సంజన కెరీర్ ఎలాంటి మలుపుతిరుగుతుందో చూడాలి. (చిత్రం) సంజన