రాష్ట్రీయం

చంచల్‌గూడ జైలు తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగర శివారుకు రేస్‌కోర్స్
వీటిస్థానే గురుకుల స్కూళ్లు
జూన్‌నాటికి పూర్తిచేయాలి
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం

హైదరాబాద్, డిసెంబర్ 29: నగరంలోని చంచల్‌గూడ సెంట్రల్ జైలును చర్లపల్లికి, మలక్‌పేటలోని రేస్‌కోర్స్‌ను నగర శివారుకు తరలించాలని సిఎం చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. తరలించిన తర్వాత రెండు స్థలాలను గురుకుల పాఠశాలల నిర్మాణానికి ఉపయోగించాలని సూచించారు. సచివాలయంలో మంగళవారం మైనార్టీ సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, సిఎస్ రాజీవ్ శర్మ, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, ఎసిబి డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్ తదితరులతో సిఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్‌లో మైనార్టీ విద్యార్థుల కోసం 60 గురుకుల పాఠశాలలు ప్రారంభించాలని ఆదేశించారు. వాటి నిర్మాణాల కోసం స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. చంచల్‌గూడ జైలును చర్లపల్లికి తరలించాలని, అలాగే రేస్ కోర్స్‌ను నగర శివారుకు తరలించి వాటి స్థానంలో గురుకుల పాఠశాల నిర్మాణం జరపాలని సూచించారు. రాష్టవ్య్రాప్తంగా వచ్చే జూన్‌నాటికి మైనార్టీలకు 60 గురుకుల పాఠశాలలు ప్రారంభించాలని, వీటిలో 30 బాలికలకు, 30 బాలుర కోసం కేటాయించాలన్నారు. వీటికి మైనార్టీ సంక్షేమ శాఖ నిధులు కేటాయించినప్పటికీ, నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ స్వీకరించాలన్నారు. వీటిలో ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన జరగాలని, మొదటి ఏడాది 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించి ప్రతి ఏడాదీ ఒక్కో తరగతి పెంచుకుంటూ ఇంటర్మీడియట్ వరకు అక్కడే విద్యా బోధన జరగేలా చూడాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో జూన్‌లో మైనార్టీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కావాలని, వీటికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అంటూనే, మైనార్టీ సంక్షేమ శాఖ, విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. మొదటి ఏడాది అద్దె భవనాల్లో పాఠశాలలు ప్రారంభించి, 2017 నాటికి కొత్త భవనాల్లోకి వాటిని తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. వీటికి అవసరమైన బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు డిఎస్సీ నోటిఫికేషన్‌తోపాటే జారీ చేయాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని సూచించారు. మైనార్టీలు ఎక్కువ ఉన్నచోట గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని, వాటికోసం స్థలాలను గుర్తించాలన్నారు. వీటికోసం వక్ఫ్ బోర్డు స్థలాలను కూడా వినియోగించుకోవచ్చని సూచించారు. ఒక్కో భవనాన్ని రూ.20 కోట్లతో ఆరు ఎకరాల విస్ణీర్ణంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బడ్జెట్‌లోనే గురుకుల పాఠశాలల ఏర్పాటుకు నిధులు కేటాయించనున్నట్టు సిఎం వెల్లడించారు.