రాష్ట్రీయం

చండీయాగానికి బాబును పిలుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సురవరం విమర్శలు సబబు కాదు
ఎవరి నమ్మకాలు వాళ్లవి
సొంత ఖర్చులతోనే యాగం
స్పష్టం చేసిన కెసిఆర్
హైదరాబాద్, నవంబర్ 24: వచ్చేనెల 23 నుంచి 27 వరకు ఆయుత మహా చండీయాగం నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మహా చండీయాగం గురించి ప్రశ్నించగా, సురవరం సుధాకర్‌రెడ్డి లాంటి పెద్ద మనిషి ఈ యాగాన్ని విమర్శించడం సరికాదని అన్నారు. తనకు దైవంపై నమ్మకం ఉందని, యాగాలు చేయడం తనకు కొత్తేమీ కాదని అన్నారు. తెలంగాణ సాధన కోసం యాగాలు చేశాను, ఇప్పుడూ చేస్తానని అన్నారు. ఆయుత మహా చండీయాగం చేయడానికి ఖర్చు పెద్ద సమస్య కాదని, వందలాదిమందిని సమన్వయం చేయడం కష్టమని అన్నారు. ఈ యాగం నిర్వహించడానికి నాలుగువేల మంది వరకు రుత్విక్కులు అవసరం అని, మన రాష్ట్రంలోనే కాకుండా కేరళతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వస్తారని తెలిపారు. తాను వ్యక్తిగతంగానే ఈ యాగం నిర్వహిస్తున్నానని, రెండు కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని అన్నారు. ఆధ్యాత్మిక భావాలు ఉన్నవాళ్లు యాగానికి సహాయం చేసేందుకు ముందుకు వస్తారని అన్నారు.
భోజన ఖర్చులు భరిస్తానని ఒకరు, ఏర్పాట్ల కోసం ఒకరు ఇలా చాలా మంది ముందుకు వచ్చారని తెలిపారు. రాష్టప్రతి ఈ యాగానికి హాజరవుతారని, అదే విధంగా కొందరు గవర్నర్లు వస్తారని చెప్పారు. కొందరు ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కూడా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. నమ్మకం అనేది వ్యక్తిగతమని ఇలాంటి వాటిపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. విద్యుత్ ఉపయోగించుకున్నా అందరి మాదిరిగానే డబ్బు చెల్లించాలని ఏర్పాట్లు చూస్తున్న కార్యకర్తలకు చెప్పినట్టు తెలిపారు.