రాష్ట్రీయం

గంగిరెడ్డి భార్య పిటిషన్‌పై 7న హైకోర్టు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతివాదిగా చంద్రబాబు పేరు తొలగింపు
హైదరాబాద్, డిసెంబర్ 4: తన భర్తను తెలంగాణలోని ఏదైనా జైలుకు తరలించాలని కోరుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డి భార్య మాళవిక దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా ఈ పిటిషన్‌లో రెస్పాండెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరును మాళవిక ప్రస్తావించడాన్ని తొలగించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. సిఐడి అధికారులు ఇటీవల మారిషస్‌లో ఉన్న గంగిరెడ్డిని అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చిన విషయం విదితమే. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో గంగిరెడ్డి విచారణ ఖైదీగా ఉన్నారు. తన భర్తకు ప్రాణహాని ఉందని మాళవిక పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన తర్వాత హైకోర్టు ఉన్నత స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు పేరును రెస్పాండెంట్‌గా చేర్చడం తగదని, ఈ పేరును పిటిషన్ నుంచి తొలగించాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసును ఈ నెల 7వ తేదీన విచారణకు స్వీకరిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.