జోరు పెంచిన చరణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా రెండు సినిమాల అపజయాలతో కాస్త డీలాపడ్డ మెగా హీరో రామ్‌చరణ్ తన తదుపరి చిత్రాలతో జోరు పెంచనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత చాలా జాగ్రత్తగా తదుపరి చిత్రాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పలు కథలు వింటున్న చరణ్, ఇటీవలే తమిళంలో ఘనవిజయం సాధించిన తని ‘ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. దీంతోపాటు తమిళ దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. దాంతోపాటు బాబాయ్ పవన్‌కళ్యాణ్ నిర్మించే సినిమా కూడా జనవరిలో ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయం ఫైనల్ కాలేదు. దాంతోపాటు తాజాగా మిర్చి వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన యు.వి. క్రియేషన్స్ బ్యానర్‌లో మరో చిత్రం చేయడానికి కూడా రెడీ అయ్యడట. గోపీచంద్‌తో ‘జిల్’ చిత్రాన్ని రూపొందించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని, ప్రస్తుతం కథా చర్చలు జరుపుకుంటున్నట్టు తెలిసింది. మొత్తానికి వచ్చే ఏడాది తన డైరీని ఖాళీలేకుండా చూసుకుంటున్నాడు చరణ్. మరోవైపు బాలీవుడ్‌లో కూడా ఓ క్రేజీ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.