చరణ్ క్రేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం విభిన్నమైన కథ, కథనంతో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్నాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో 1985 నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం తరువాత బోయపాటితో సినిమా చేస్తున్నాడు చరణ్. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేశాడు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి అప్పుడే బిజినెస్ పరంగా భారీ ఆఫర్లు వస్తున్నాయట. ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కాకముందే సినిమాకు భారీ ఆఫర్ రావడం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్, హిందీ హక్కుల కోసం ఓ పార్టీ భారీ రేటుకి ఆఫర్ చేసిందట. రామ్‌చరణ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ రేట్ అని వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఈ చిత్రానికి ఏకంగా 22 కోట్ల భారీమొత్తానికి హిందీ డబ్బింగ్ హక్కులు, శాటిలైట్ రైట్స్ తీసుకున్నారట. ఒకరకంగా తెలుగులో ఏ హీరోకు దక్కని క్రేజ్ చరణ్‌కు దక్కడం విశేషం. రామ్‌చరణ్, బోయపాటి శ్రీనుల చిత్రాలకు నార్త్‌లో కూడా మంచి క్రేజ్ వుండడంతో ఈ ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందట.