రాష్ట్రీయం

‘ప్రాణహిత-చేవెళ్ల’ అవకతవకలపై దాఖలైన పిటిషన్ ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: ప్రాణహిత చేవేళ్ల ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థపైనా, ప్రభుత్వంపైనా అభియోగాలు మోపుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను పిటీషనర్ ఉపసంహరించుకున్నారు. సోమవారం బెంచ్ ముందుకు వచ్చిన ఈ పిటీషన్ తప్పుల తడక అని, వ్యక్తిగత ప్రయోజనాలతో దాఖలు చేసినట్లు ఉందని వ్యాఖ్యానించిన ధర్మాసనం తమ విలువైన సమయాన్ని ఇలాంటి పిటీషన్ల ద్వారా వృధా చేయవద్దని సున్నితంగా హెచ్చరించింది. కరీంనగర్‌కు చెందిన ఎన్‌జివో బ్రైట్ ఇండియా దాఖలు చేసిన పిటీషన్‌లో సత్యం రామలింగరాజుకు చెందిన మైటాస్ కంపెనీకి ఈ కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం కట్టబెట్టిందని, దీనిలో వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది ఈ పిటీషన్‌పై వివరణ ఇస్తూ పిటీషనర్ కాంట్రాక్టర్ అని, ఈ ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్ట్ ఇవ్వని కారణంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీని ద్వారా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పిటీషనర్ తరఫు న్యాయవాది తమకు పిటీషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని అభ్యర్థించడంతో కోర్టు అనుమతించింది.