కించపరిచే ఉద్దేశం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు టాకీస్ చిత్రంలోని పాత్రలను అనుసరించి వికలాంగుల సన్నివేశాన్ని చిత్రీకరించామే తప్ప ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం మాకు లేదని దర్శకుడు ప్రవీణ్ సత్తారు అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, రేష్మీగౌతమ్ ప్రధాన తారాగణంగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూర్ టాకీస్’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో వికలాంగులను కించపరిచేలా చిత్రీకరించారని, తెలంగాణా వికలాంగుల సంఘం సినిమాపై కేసు వేసిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను దర్శకుడు తన వివరణను ప్రకటించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఈ సన్నివేశంతో ఎవరైనా బాధపడి వున్నట్లయితే ఈరోజునుంచే ఈ చిత్రంలో ఆ సన్నివేశాన్ని తొలగిస్తున్నామని అన్నారు.