బ్యాంకాక్‌లో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కన్ను సినిమా ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్లి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తనిఒరువన్’కు రీమేక్ అయిన ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో కొద్ది రోజులుగా ఓ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇక ఈ షెడ్యూల్ తర్వాత టీమ్ ఈనెల 20 నుంచి బ్యాంకాక్‌లో ఓ చిన్న షెడ్యూల్ మొదలుపెట్టనుంది. బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే మళ్లీ హైదరాబాద్‌లో నెల రోజులపాటు నిరాటంకంగా సినిమా ఓ నెల రోజుల భారీ షెడ్యూల్ జరుపుకోనుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘తనిఒరువన్’లో విలన్ పాత్ర చేసి మెప్పించిన అరవింద్ స్వామి, తెలుగులోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. హిపాప్ తమీజా, అశిమ్ మిత్రా లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు ‘రక్షక్’, ‘్ధృవ’ అన్న టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.