25న రానున్న ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన తారాగణంగా పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అనె్న రూపొందించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఊపిరి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 25న విడుదలకు సిద్ధమైంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. మనం, సోగ్గాడే చిన్నినాయనా వంటి చిత్రాల తర్వాత నాగార్జున టోటల్‌గా వైవిధ్యమైన పాత్రలో నటించారని, అలాగే ఆవారా జంట కార్తీ, తమన్నా మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారని తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు సింగిల్ కట్ లేకుండా పూర్తయ్యాయని, క్లీన్ యు సర్ట్ఫికెట్ పొందిందని అన్నారు. సెన్సార్ సభ్యులు చిత్రాన్ని మెచ్చుకున్నారని, ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, నార్త్ ఇండియా, యుఎస్, గల్ఫ్ కంట్రీస్, మలేషియా, శ్రీలంక, సింగపూర్, యుకె, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నామని ఆయన అన్నారు.