పోయే ఏనుగు పో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ఏనుగు కొంతమంది చిన్న పిల్లల మధ్య జరిగే అద్భుతమైన సన్నివేశాలతో రూపొందుతున్న చిత్రం -పోయే ఏనుగు పో. పికెఎస్ క్రియేషన్స్‌పై దర్శకుడు కెవి రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఇదే చిత్రాన్ని తమిళంలోనూ ‘పో యానైకుట్టియే పో’ టైటిల్‌తో నిర్మాత ఎం రాజేంద్రన్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. చిత్రం తెలుగు టైటిల్ లోగో, బ్యానర్ లోగోను నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. -వైవిధ్యంతో టైటిల్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు కెవి రెడ్డి మంచి కథ, డైలాగ్స్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారు. ద్విభాషలో రూపొందుతున్న సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. చిత్ర నిర్మాత ఎం రాజేంద్రన్ మాట్లాడుతూ -ఇదొక కుటుంబ కథా చిత్రం. ఏనుగు, కొంతమంది పిల్లల మధ్య సాగే ఆరోగ్యకర సన్నివేశాలతో దర్శకుడు కెవి రెడ్డి తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నాం అన్నారు. ఈ చిత్రానికి అమర్ జి సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.