అల్లుడు శీనుతో స్వాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది స్వాతి. కెరీర్ జెట్ స్పీడ్‌లోవున్న సమయంలోనే -ఇటీవలే ఎన్నో అంచనాలతో వచ్చిన త్రిపుర కమర్షియల్ హిట్‌కు దూరమై డీలాపడింది. అయినా ‘త్రిపుర’గా స్వాతికి మంచి మార్కులే పడ్డాయి. దాంతో ఇప్పుడు టాలీవుడ్‌లో స్వాతికి వరుస అవకాశాలు వస్తున్నాయట. లేటెస్ట్‌గా ఈ భామ ఓ ప్రముఖ నిర్మాత కొడుకు సినిమాలో హీరోయిన్‌గా చేస్తుందన్న టాక్ నడుస్తోంది. ఆ నిర్మాత ఎవరో కాదు బెల్లంకొండ సురేష్. ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు శీనుతో మంచి విజయాన్ని అందుకుని ఇప్పుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ సినిమా తరువాత గుండె జారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్‌కుమార్ కొండ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అయ్యాడు. ఆ సినిమాలో స్వాతి హీరోయిన్‌గా నటిస్తుందట. ఇటీవలే హీరోయిన్‌గా స్వాతిని ఓకే చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.