రొమాంటిక్.. రమ్యకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతోన్న సినిమా -రొమాంటిక్. పూరి డైరెక్షన్ విభాగంలో వర్క్ చేసిన అనీల్ పారు డైరెక్టర్‌గా పరిచయం అవుతుంటే -కొడుకు కోసం ఈ కథను పూరీయే తయారు చేశాడు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. తాజా అప్‌డేట్ ఏంటంటే -గోవా షూట్‌లోకి రమ్యకృష్ణ జాయినైందట. చిత్రమేమంటే, ఇప్పుడో గోవాలో షూట్ చేస్తున్న ఎపిసోడ్‌ను ఇంతకుముందు మందిరాబేడీని పెట్టి చేశారు. మందిరా-ఆకాష్ కాంబినేషన్స్ సీన్స్ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆమెను పక్కనపెట్టి రమ్యకృష్ణను సీన్‌లోకి తీసుకొచ్చారట. మాఫియా నేపథ్యంగా సాగే లవ్‌స్టోరీలో ఆకాష్‌తో కేతికాశర్మ జోడీ కడుతోంది. తాజాగా ప్రాజెక్టులోకి రమ్యకృష్ణను తీసుకోవడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఆకాష్‌ను హీరోగా నిలబెట్టేందుకు పూరి చేస్తున్న ‘రొమాంటిక్’ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.