సాయిధరమ్ కొత్త చిత్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్ తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి సన్నివేశాన్ని హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో చిత్రీకరించారు. అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, వి.వి.వినాయక్ తొలి క్లాప్‌నిచ్చారు. శ్రీనువైట్ల తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్ పాత్ర హైలెట్‌గా వుంటుందని, ఆయన నటన, డాన్సులు, ఫైట్లు సరికొత్త తరహాగా వుండేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. జూన్ 10 నుండి షూటింగ్ ప్రారంభించి వైజాగ్, హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తిచేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి మంచి కథ, మంచి సాంకేతిక నిపుణులు దొరికారని, తప్పక మంచి సినిమా రూపొందిస్తామని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:తమన్, కెమెరా:్ఛటా కె.నాయుడు, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్:ఎ.ఎస్.ప్రకాష్, నిర్మాతలు:నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు, దర్శకత్వం:గోపీచంద్ మలినేని.