ఆ రెండింటిలో ఇదే ఫస్ట్ టైం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థ్రిల్లర్ జోనర్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడమే కాదు, ఓ పాటకు సెమీ క్లాసికల్‌లో బాణీకట్టే అవకాశమూ -రాగల 24 గంటల్లో చిత్రంతో వచ్చిందంటున్నాడు సంగీత దర్శకుడు రఘు కుంచె. శ్రీనివాస్ కానూరు నిర్మాతగా ఈషారెబ్బా, సత్యదేవ్ లీడ్‌రోల్స్‌లో దర్శకుడు శ్రీనివాసరెడ్డి తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం -రాగల 24 గంటల్లో. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రఘు కుంచె మీడియాతో మాట్లాడాడు. కథ చెప్పినపుడే -కెమెరా, సంగీతం రెండు కళ్లంటూ దర్శకుడు చెబుతూవచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే క్రైమ్ థ్రిల్లర్‌కు ఫస్ట్ టైం ఆర్‌ఆర్ అందించా. నిజానికి ఈ దర్శకుడితో నాకు రెండో సినిమా. బట్, కథ చెబుతున్నపుడే ఆ ఇంటెన్సిటీ థ్రిల్‌నిచ్చింది. ఫస్ట్ఫా ట్విస్ట్‌ల్ని సెకెండాఫ్‌లో రివీల్ చేసిన విధానం.. దర్శకుడిగా శ్రీనివాసరెడ్డి అనుభవం చెబుతోంది. మెచ్యూర్డ్‌గా సినిమాను తెరకెక్కించాడు. హీరోయిన్ ఇంట్రో, వెస్ట్రన్ సాంగ్, ప్రమోషనల్ సాంగ్.. మూడు పాటలుంటాయ. పాటల బాణీలకంటే బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వడమే ఛాలెంజింగ్ అనిపించింది. ఈ సినిమా నా కెరీర్ ప్రొఫైల్ పెంచుతుందని నమ్ముతున్నా అన్నాడు రఘు కుంచె.