పద్ధతైన పాత్రలే చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియల్ లైఫ్ ఎక్స్‌ప్రెషన్స్‌ని కెమెరా ముందు ఎగ్జిబిట్ చేయడం అనుకున్నంత సులువు కాదు అంటోంది టాలీవుడ్ కొత్త బ్యూటీ హర్షితా చౌదరి. నటిగా తనకు ఇన్‌స్పిరేషన్ ఒకప్పటి భానుమతి, సావిత్రి, సౌందర్యలే కాదు, సీనియర్ ఆర్టిస్ట్ నిత్యమీనన్ కూడా అంటోంది. హీరోయిన్‌గా హర్షితా చౌదరి అరంగేట్రం చేస్తున్న సినిమా -తోలుబొమ్మలాట. రాజేంద్రప్రసాద్, విశ్వంత్, వెనె్నల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రాన్ని మాగంటి దుర్గాప్రసాద్ నిర్మాతగా డెబ్యూ డైరెక్టర్ మాగంటి విశ్వనాథ్ తెరకెక్కించాడు. విడుదలకు సిద్ధమవుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రమోషనల్స్‌లో భాగంగా హీరోయిన్ హర్షితా చౌదరి మీడియాతో మాట్లాడింది.
నేను హైదరాబాదీని. మాస్ కమ్యూనికేషన్స్‌లో పీజీ చేస్తున్నా. కొన్ని ప్రింట్ మీడియా యాడ్స్‌లో చేశా. అలా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలు చూసి.. టాలెంట్ ఏజెంట్ ద్వారా ఈ సినిమాలో చాన్స్ వచ్చింది.
నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో, ప్రొఫెషనల్‌గా చాన్స్‌ల కోసం ప్రయత్నించలేదు. నాకు ఇష్టమైన కెరీర్‌ను ప్రోత్సహించే పేరెంట్స్‌వున్నా, వచ్చిన అవకాశాల్లో ఫిల్ట్‌ర్ చేసుకుని నచ్చినవి మాత్రమే చేయాలన్న ఆలోచనతో ఉన్నా.
నటనతో ఇంప్రెస్ చేయడం అంత సులువు కాదన్న విషయం ఫస్ట్ సినిమాతోనే అర్థమైంది.
తోలుబొమ్మలాట చిత్రంలో హోలీగా కనిపించే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్ర పోషించా. సాధారణ అమ్మాయిలా కనిపిస్తా. బట్, చివర్లో స్ట్రాంగ్ ఎమోషనల్ స్ట్రగుల్ చూపించే పాత్ర.
రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్ ఆర్టిస్టులతో పని చేయడం గొప్ప ఎక్స్‌పీరియన్స్. నటనలో చాలా టిప్స్ నేర్చుకున్నా. ఆయన మనవరాలిగా కనిపిస్తా.
సినిమా చూసుకున్నాక.. ఆ పాత్రను మరింత బాగా చేసి ఉండొచ్చు అనిపించింది. బట్, నా పాత్రకు మంచి అప్లాజ్ వస్తుంది. సినిమాలు చేస్తూవుంటే, పరిణితి వస్తుందన్న నమ్మకంతో ఉన్నా.
ఇదే మొదటి సినిమా. సో, ఫలానా పాత్ర కావాలని చూజ్ చేసుకునే స్థాయికాదు నాది. కాని వచ్చిన పాత్రలన్నీ చేసేయాలన్న ఆలోచనా లేదు. నా లిమిటేషన్స్‌కు అనుగుణంగా నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా.
చెప్పానుగా, లిమిటేషన్స్ ఉన్నాయని. అందుకే పొట్టిదస్తులు, క్లోజ్ ఇంటిమసీ సన్నివేశాలున్న కథలను ఎంచుకోలేను. భవిష్యత్‌లోనూ చేయనని చెప్పనుగానీ, అంత ప్రొఫెషనాలిటీ వచ్చిన తరువాత ఆలోచిస్తా.
నటనే కాదు, అకడమిక్ బ్యాకప్ ఉంది కనుక.. నేను చేయలేని పాత్రలంటూ వస్తే చదువుపై ఫోకస్ పెడతా.
నా ఫస్ట్ సినిమా అవకాశమే మంచి ఫ్యామిలీ డ్రామాలో పడటం హ్యాపీగా ఉంది. పెద్ద ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేయడం హ్యాపీ.
ఈ సినిమాకు నేను డబ్బింగ్ చెప్పలేదు. నా వాయిస్‌లో బేస్ ఎక్కువ. కాస్త హస్కీ కూడా ఉంటుంది. తెలుగు మాడ్యులేషన్ సైతం ఓకే అయినా, డామినేటింగ్‌గా ఉండటంతో సన్నివేశాలు డెప్త్ తగ్గుతుందని డబ్బింగ్ ఆర్టిస్టు చేత వాయిస్ చెప్పించారు. ఒకవిధంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎక్స్‌ప్రెసివ్ వాయిస్‌తో నా యాక్టింగ్ వెరే లెవెల్‌లో కనిపిస్తుందనే అనుకుంటున్నా.
దీని తరువాత మరో కొత్త సినిమా డిస్కషన్స్‌లో ఉంది. ఆ ప్రాజెక్టు ఫైనలైతే వివరాలు అప్పుడు చెబుతా.
తొలి సినిమా అయినా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. టైమ్ మేనేజ్‌మెంట్, దేన్నైనా పాజిటివ్‌గా తీసుకోవడం లాంటి విషయాలు అనుభవంలోకి వచ్చాయి. ఇదంతా కెరీర్ ప్రొఫెషనలిజానికి ఉపకరిస్తుందనే అనుకుంటున్నా.
దర్శకుడు విశ్వనాథ్ -మెత్తగా మాట్లాడే మనిషి. ఎవ్వరినీ హర్ట్ చేయకుండా తనకు కావాల్సింది చేయించుకుంటాడు. నిజానికిది ఫస్ట్ సినిమా. కథ వినేటప్పుడు ఇంత హెవీ డ్రామా తీసుకున్నాడేంటి అనుకున్నా. నెరేషన్ విన్నాక, మళ్లీ అలాంటి ఆలోచన రాలేదు. ఎమోషనల్ రిలేషన్స్‌నీ పాటల్లో సింపుల్‌గా ఎక్స్‌పోజ్ చేయడం దర్శకత్వంపై ఆయనకున్న పట్టును చెప్పకనే చెబుతోంది.