ఆ ఒక్కటీ అడక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ అందాల భామ సోనమ్‌కపూర్‌కు ఈమధ్య పెద్దగా సినిమాలు లేవు. చేసిన సినిమాలన్నీ పరాజయాల పాలవడంతో పాపం ఈమెకు అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటికే పలుమార్లు మేగజైన్లకోసం హాట్ హాట్‌గా ఫొటో షూట్‌లు ఇచ్చినా కూడా పెద్దగా లాభం లేకపోయింది. ప్రస్తుతం ఒక్క సినిమా కూడా చేయడంలేదు. కానీ అప్పుడప్పుడు ఫొటోషూట్‌లతో రెచ్చిపోయి ఛాన్స్‌లు కొట్టేసే ప్రయత్నం మాత్రం మానడంలేదు. దాంతోపాటు మీడియాలో కూడా కనిపిస్తూ తన హవా ప్రూవ్ చేసుకుంటోంది. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈమె చేసిన కామెంట్ బాలీవుడ్‌లో హాట్ టాపిగ్గా మారింది. ఇంతకీ సోనమ్ ఏమందో తెలుసా? ‘నేను సెలబ్రిటీని కాబట్టే నా గురించి అడగండి. అంతేకానీ నా బాయ్‌ఫ్రెండ్ ఎవరు? అతనెక్కడుంటాడు? అతని పేరేంటి? లాంటి విషయాలు మాత్రం అడగకండి’ అని గట్టిగానే చెబుతోంది. దీన్నిబట్టి చూస్తే ఈమెకు కూడా బాయ్‌ఫ్రెండ్ వున్నాడంటూ మీడియా కోడై కూస్తుందనే ప్లాన్‌లో వున్నట్టుంది. ఇంతకీ ఈమెకు బాయ్‌ఫ్రెండ్ వున్నట్టా లేనట్టా అనే సందేహం బాలీవుడ్ జనాల్లో కలిగింది. మొత్తానికి ఎలాగైనా సరే పబ్లిసిటీ చేసుకోవడంలో సోనమ్ గడుసుదేకదా!

చిత్రం సోనమ్‌కపూర్