15న రైట్ రైట్ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వెంకటేశ్వర్లు నిర్మిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ఇటీవలే పాటల చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, తన కెరీర్‌లో భిన్నమైన చిత్రంగా నిలిచిపోతుందని, ఇదొక కొత్త ప్రయత్నమని, అందరూ స్టైలిష్ సినిమాలు చేస్తుంటే, తాను మాత్రం సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు చేస్తున్నానని అన్నారు. ‘దృశ్యం’, ‘ఊపిరి’, ‘క్షణం’లాంటి డిఫరెంట్ జోనర్ సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమా చేయడం కరెక్టే అనిపించిందని, ఇటీవలే విడుదల చేసిన ఒక పాటకు మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. ఈనెల 15న ఆడియోను విడుదల చేస్తున్నామన్నారు. నిర్మాత మాట్లాడుతూ, విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా అన్నిరకాల కమర్షియల్ అంశాలతోపాటు సహజత్వానికి దగ్గరగా వుంటుందని, సుమంత్ అశ్విన్ అద్భుతంగా నటిస్తున్నాడని, త్వరలోనే మిగతా కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.