Others

చీమ దోమ ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో అత్యంత అల్పప్రాణి చీమ మనిషిగా మారాలనుకుంటుంది. కోరిక సరే, అలా మారడం సాధ్యమా? మారితే ఏం జరుగుతుంది? అలా మారిన చీమకు ప్రేమ, శృంగారం తోడైతే ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే -చీమ ప్రేమ మధ్యలో భామ. మాగ్నమ్ ఓపస్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్‌ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తోన్న చిత్రమిది. అమిత్, ఇందు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆడియో తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు అప్పలరాజు మాట్లాడుతూ -సినిమా గురించి ఎంతచెప్పినా తక్కువే. మా సినిమాకి చీమే కథ. జగమంతా రామమయం. మా సినిమా మొత్తం చీమమయం. సినిమాలో పాటలన్నీ బాగావచ్చాయి అన్నారు. నిర్మాత ఎస్‌ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ -మా చిత్రంలో చీమ ప్రధాన ఆకర్షణ. గ్రాఫిక్స్ బావున్నాయి. సినిమా కొత్తవాళ్లతో చిత్రీకరించినా ఖర్చుకి వెనకాడలేదు. రవివర్మ అందించిన సంగీతం అద్భుతం. కొత్తవారితో సినిమా కథని ఎలాచెప్పాలో దర్శకుడు అలానే తెరకెక్కించాడు. సినిమా బాగా వచ్చింది అన్నారు. సంగీత దర్శకుడు, సింగర్ రవివర్మ మాట్లాడుతూ -మంచి కథకు సంగీతం అందించే అవకాశం దక్కింది. చిన్న సినిమాని అంతా ఆదరించాలి అన్నారు. కార్యక్రమంలో సింగర్ మాధురి, డిస్ట్రిబ్యూటర్ బాపినీడు తదితరులు మాట్లాడారు.