వక్కంతంతో వరుణ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాక్సర్‌గా విశ్వరూపం చూపించేందుకు గద్దలకొండ గణేష్ గట్టిగానే కష్టపడుతున్నాడు. వరుణ్‌తేజ్‌ను స్ట్రీట్‌బాక్సర్‌గా చూపిస్తూ దర్శకుడు కిరణ్‌కుమార్ తెరకెక్కించనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్స్ కొలిక్కి వచ్చాయట. టైం కలిస్తొసే వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లిపోతుంది. ఈలోగానే తరువాతి ప్రాజెక్టునూ లైన్‌లో పెట్టే పనిలోవున్నాడు వరుణ్. డిఫరెంట్ జోనర్లను టచ్ చేస్తూ వస్తున్న వరుణ్ -ఈసారి వక్కంతం వంశీ చెప్పిన కథకు కనెక్టయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. రచయితగా ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన వక్కంతం -దర్శకుడిగా తొలి సినిమా ‘నా పేరు సూర్య..’తోనే చతికిలపడ్డాడు. బన్నీ కెరీర్‌లో ‘నా పేరు సూర్య’ అతి పెద్ద డిజాస్టర్. అయితే అదేమీ పట్టించుకోకుండా వక్కంతం చెప్పిన కథపై నమ్మకంతో వరుణ్ ముందుకెళ్లడానికే నిశ్చయించుకున్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అప్‌డేట్స్ రావొచ్చన్న మాట వినిపిస్తోంది.