మరో వెపన్ రెడీ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ అంటూ రాకూడదు. వస్తేమాత్రం -సత్తా చాటేందుకు సవాలక్ష ట్రిక్స్ మొదలవుతాయి. ఇండస్ట్రీలో ఇప్పుడిదే కనిపిస్తోంది. సంక్రాంతి మరో నెలన్నర దూరంలోవున్నా -పండగ సినిమాలు మాత్రం ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడానికి ప్రమోషనల్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయి. అంటే -సంక్రాంతి సినిమాల మధ్య ప్రమోషనల్ పోటీ పీక్స్‌కి చేరుతోందన్న మాట. పెద్దపండక్కి ఒకరోజు తేడాలో విడుదలవుతున్న పెద్ద సినిమాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు. ఏ సినిమా ప్రత్యేకతలు ఆ సినిమాకున్నాయి. నిజానికి బన్నీతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న అల వైకుంఠపురమలో సినిమా -ముందు ప్రమోషన్స్ మొదలెట్టి ఒకడుగు ముందుకేసింది. బన్సీ ఫస్ట్‌లుక్‌తో ఆసక్తి రేకెత్తించి, వరుసగా వదిలిన పాటలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మహేష్‌తో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న సరిలేరు నీకెవ్వరు.. కాస్త ఆలస్యంగానే ప్రమోషన్స్ మొదలెట్టినా -ఇటీవలే మాజ్ టీజర్‌ను వదిలి ఆసక్తి రేకెత్తించారు. తాజాగా విడుదల చేసిన వీడియో మాస్ లిరికల్‌తో ‘మైండ్ బ్లాక్’ చేసేశారు. మంచి ఊపునిచ్చే బీటుకు మహేష్ మాస్ స్టయిల్ డైలాగ్స్‌ని యాడ్ చేసి -సంగీత దర్శకుడు దేవీశ్రీ పాటను ఎక్కడో కూర్చోబెట్టాడు. ఈ డప్పు పాటకు తమన్నా ఐటెమ్ స్టెప్స్ తోడైతే -ఈ సాంగ్ సినిమాకు ఎక్స్‌ట్రా బూస్టేనన్న టాక్ వచ్చింది. దీనికి పోటీగా అల.. -టీం మరో ప్రచారాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. తమన్ కంపోజ్ చేసిన ‘సామజవరగమన’ సాంగ్ వంద మిలియన్ వ్యూస్ దాటడంతో -ఆ పాట విజువల్స్‌పెట్టి నిమిషం నిడివివున్న వీడియోని కట్ చేయాలన్న తలంపుతో అల టీం ఉందట. అలాగే -సినిమా టీజర్ సైతం దాదాపుగా రెడీ అయ్యింది. రెండింట్లో ఏది ముందు విడుదల చేయాలన్న విషయాన్ని ఫీడ్‌బ్యాక్‌ని బట్టి డిసైడ్ చేస్తారట. దీనిపై సరిలేరు నీకెవ్వరు టీం ఏం వ్యూహంతో ముందుకొస్తుందో చూడాలి. రెండు పెద్ద చిత్రాలమధ్య ప్రమోషనల్ పోటీ ప్రస్తుతానికి యూట్యూబ్, సోషల్ మీడియాకే పరిమితమైంది. బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు విజయం సాధిస్తారన్నది మరింత ఆసక్తికరం కానుంది. ఎవరి ప్రమోషనల్ వ్యూహాలు ఫలించాయి, ఎవరు ఆడియన్స్‌ని ఎక్కువ ఆకట్టుకున్నారన్నది -వెండితెరపై చూడాల్సిన సినిమా.