16న దర్బార్ ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దర్బార్’ ట్రైలర్ చూపించడానికి రెడీ అయిపోయాడు రజనీకాంత్. మురుగదాస్ తెరకెక్కించిన చిత్రంపై తమిళ, తెలుగు ఆడియన్స్‌లో ఆసక్తి ఉండటం తెలిసిందే. చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ -డిసెంబర్ 16న ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా మురుగదాస్ ప్రకటించాడు. ముంబై నేపథ్యంగా సాగే మాఫియా కథలో రజనీ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు. అందుకే అధిక శాతం సినిమాను మంబైలోనే షూట్ చేశారు. సూపర్‌స్టార్‌కు జోడీగా లేడీ సూపర్‌స్టార్ నయనతార కనిపించనుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న చిత్రానికి అనిరుథ్ సంగీతం సమకూరుస్తున్నాడు. సంక్రాంతి చిత్రంగా దర్బార్ థియేటర్లకు రానుంది.