ప్రీ రిలీజ్‌కు డిస్కోరాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నా, తన స్టామినాపై నమ్మకంతో రవితేజ చేస్తోన్న తాజా చిత్రం -డిస్కోరాజా. సైన్స్ ఫిక్షన్ పాయింట్‌ను థ్రిల్లర్ జోనర్‌లో విఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రమిది. సక్సెస్ కొట్టాలన్న కసితో చిత్రబృందం ఇప్పటికే రెండు టీజర్లు విడుదల చేసి, ప్రేక్షకుల్లో అంచనాలు పెంచారు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో -ప్రీ రిలీజ్ వేడుకకు భారీ ఏర్పాట్లు చేస్తోంది చిత్రబృందం. జనవరి 24న విడుదల కానున్న చిత్రానికి -19న హైదరాబాద్ ఎన్ కనె్వన్షన్ సెంటర్లో ప్రీ రిలీజ్ నిర్వహించనున్నారు. రవితేజ డ్యూయల్ రోల్ చేస్తోన్న చిత్రంలో నభానటేష్, పాయల్ రాజ్‌పుత్, తన్యాహోప్ హీరోయిన్లు. బాబీసింహ ప్రతినాయకుడు. చిత్రంలో సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుంది. అది ప్రేక్షకులు నమ్మేలా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. డిస్కోరాజా -ఓ లాజికల్ ఫన్ రైడ్ అంటోంది చిత్రబృందం. జనవరి సెకెండాఫ్‌లో వచ్చిన పెద్ద హీరోల సినిమాలన్నీ దాదాపు హిట్టు రేంజ్‌తోనే కొనసాగుతుండటంతో -కొత్త ఏడాది మొదటి నెల -రవితేజకు ఎలాంటి హిట్టునిస్తుందో చూడాలి.