పూర్తయిన సముద్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రమాకాంత్, భానుశ్రీ, అవంతిక ప్రధాన తారాగణంగా కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై నాగేష్ నారదాసి దర్శకత్వంలో బదావత్ కిషన్ రూపొందిస్తున్న చిత్రం ‘సముద్రుడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ గత 25 రోజులుగా చీరాల ఓడరేవు సముద్ర తీరాన జరిగింది. రెండో షెడ్యూల్ ముగించేసరికి మూడు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తిచేశారు. త్వరలో పాటల చిత్రీకరణ ఫారిన్‌లో జరుగనున్నదని దర్శకుడు తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌తో పూర్తి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, సముద్రంలోకి వెళ్లిన వేటగాళ్లు తిరిగి ఇంటికి వచ్చేదాకా అక్కడి పరిస్థితులు, సముద్రంపై పరిస్థితులు ఎలా వంటాయి అన్న అంశంతో ఓ అందమైన ప్రేమకథను ఈ చిత్రంలో చర్చిస్తున్నామని, అన్ని కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో ఉంటాయని తెలిపారు. వైవిధ్యమైన కథనంతో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రతిఒక్కరికీ నచ్చుతుందని, ముఖ్యంగా ఇన్నాళ్లు జరిగిన ఈ షూటింగ్‌లో ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిందని హీరో హీరోయిన్లకు మంచి పేరు వస్తుందని నిర్మాత బతావత్ కిషన్ తెలిపారు. సుమన్, రామరాజు, సుమన్‌వెట్టి, చిత్రం శ్రీను, శ్రావణ్, దిల్ రమేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.