ఫామ్‌లో రవితేజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ అంటేనే ఓ ఉత్తుంగ కెరటం. ఎప్పటికప్పుడు బాడీ మానరిజమ్స్ మార్చుకుంటూ, వైవిధ్యమైన డైలాగ్ డెలివరితో అటు క్లాస్ ప్రేక్షకులను ఇటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే హీరో. ప్రస్తుతం గత కొంతకాలం గ్యాప్ తీసుకున్న రవితేజ, తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిస్తున్న క్రాక్ సినిమాకు టాలీవుడ్‌లో సందడి చేయనున్నాడు. ఒక్క సినిమా తరువాత మరో సినిమా కాకుండా, వరుసగా చిత్రాలు చేయడానికే నిర్ణయించుకున్నాడో ఏమో, తాజాగా రైడ్, వీర చిత్రాలను రూపొందించిన రమేష్‌వర్మ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. తమిళనుండి రీమేక్ కానున్న ఈ చిత్రం క్రాక్ పూర్తయిన వెంటనే ప్రారంభం కానుందని టాలీవుడ్ సమాచారం. ఇన్నాళ్లు బ్రేక్ తీసుకున్నా, ఒక హిట్ కొట్టాలన్న కసితో ఉన్న రవితేజ మళ్లీ ఏదో ఒకటి హిట్ కొట్టడం ఖాయమని ఆయన అభిమానులు చెబుతున్నారు. బాక్సాఫీసును మళ్లీ తన పాత్ర చిత్రాలలాగే గలగలలాడిస్తాడని వారు చెబుతుండడం విశేషం. ఏమో.. మళ్లీ క్రాక్ తరువాత రమేష్ వర్మ రూపొందించే చిత్రం కూడా హిట్ కావచ్చేమో!