పవర్‌ఫుల్ గండ్రగొడ్డలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సీనియర్ దర్శకుడు భరత్ దర్శకత్వంలో సి.బి.డి.టి. ప్రొడక్షన్స్ పతాకంపై డి.ఎ.ఎస్.పటేల్ నిర్మిస్తున్న చిత్రం ‘గండ్రగొడ్డలి’. ఆవు చంపిన పులినెత్తురు ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. నూతన నటీనటులతో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను గురించి దర్శకుడు భరత్ మాట్లాడుతూ, అప్పట్లో వచ్చిన ప్రతిఘటన చిత్రం ఎంత పవర్‌ఫుల్‌గా వుందో అందరికీ తెలిసిందేనని, అంతకంటే పవర్‌ఫుల్ సబ్జెక్టుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఇందులో నూతన హీరో హీరోయిన్లను పరిచయం చేస్తున్నామని, అన్నిరకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కే ఈ చిత్రం సందేశాత్మకంగా వుంటుందని అన్నారు. మరుదూరి రాజా అద్భుతమైన సంభాషణలు అందించారు. వచ్చేవారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ చిత్రానికి మాటలు:మరుదూరి రాజా, సంగీతం:వరంగల్ శ్రీనివాస్, సహ నిర్మాతలు:సంతోష్‌కుమార్, కిషోర్, నిర్మాత:డి.ఎ.ఎస్.పటేల్, దర్శకత్వం:్భరత్.