అదిరింది.. బాక్సర్ లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్దలకొండ గణేష్‌లాంటి ఊరమాస్ ఎంటర్‌టైనర్ తరువాత వరుణ్ తేజ్ చేస్తున్న స్పోర్ట్స్ బేస్డ్ సినిమా -బాక్సర్. వరుణ్ బర్త్ డే సందర్భంగా ఆ ప్రాజెక్టు నుంచి ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి బయటకు వదిలారు. పెరిగిన గడ్డం, తలకు నిట్ క్యాప్‌తో పంచింగ్ బ్యాగ్‌పై చెమటలు చిందేలా ప్రాక్టీస్ చేస్తున్న వరుణ్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాక్సర్‌గా ప్రొఫెషనల్ లుక్ తెచ్చేందుకు వరుణ్ ఎలాంటి వర్కౌట్స్ చేశాడో కండలు తిరిగిన వరుణ్ అప్పియరెన్స్ చెబుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు ముద్దా, అల్లు వెంకటేష్ నిర్మిస్తోన్న చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆరంభంలో అడుగులు తడబడినా, వైవిధ్యమైన కథలతో తోటి హీరోల నుంచి సెపరేట్ ట్రాక్ వేసుకుంటున్న వరుణ్ -ఈ యాక్షన్ మూవీతో సెనే్సషన్ క్రియేట్ చేయొచ్చన్న అంచనాలు లేకపోలేదు. ఎస్‌ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న చిత్రం నుంచి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.