నారప్ప.. మొదలెట్టేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రీమేక్‌లపట్ల ఆసక్తిచూపే వెంకటేష్ -ఇప్పుడు మరో రీమేక్‌గా నారప్ప చేస్తున్నాడు. తమిళంలో ధనుష్ చేసిన అసురన్‌కు ఇది తెలుగు రీమేక్. అసురన్ హిట్టుతో తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వెంకటేష్‌తో రీమేక్‌ను తెరకెక్కిస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు.
తెలుగు రీమేక్ షూటింగ్ మొదలుపెడుతూ -తాజాగా విడుదల చేసిన వెంకటేష్ లుక్ పోస్టర్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దళిత కానె్సప్ట్‌తో వస్తోన్న చిత్రంలో వెంకటేష్ చూపిస్తోన్న ఆగ్రహావేశాలు -పాత్ర ఇంటెన్స్‌ని చెప్పకనే చెబుతున్నాయి. ఒరిజినల్‌లోని ధనుష్ లుక్ కంటే -నారప్పగా వెంకటేష్ మేకోవర్ లుక్ ఆప్ట్‌గా ఉందన్న రెస్పాన్స్ వస్తోంది.
వెంకటేష్‌కి ఇది 74వ సినిమా. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న చిత్రం తాజాగా అనంతపురంలోని షూటింగ్ స్పాట్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంది. అనంతపురం పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్ లొకేషన్స్‌లో ‘నారప్ప’ కీలక సన్నివేశాలను మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.