మిమో హీరోగా ద్విభాషా థ్రిల్లర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తి హీరోగా తెలుగు సినిమా రూపుదిద్దుకుంటోంది. శ్రీ కళాచిత్ర పతాకంపై రమణారావు బసవరాజు రూపొందిస్తున్న చిత్రానికి మాధవ్ కోదాడ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ససాచెత్రి కథానాయిక. చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాధవ్ మాట్లాడుతూ ఈ కథకు భారీ తారాగణం అయితేనే బావుంటుందని, మహేష్ మంజ్రేకర్, మురళీశర్మ, బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, రవికాలే వంటి వాళ్లు నటిస్తున్నారని తెలిపారు. తాము అనుకున్న విజయాన్ని పొందిన హీరో ఆనందం వ్యక్తం చేస్తూ పాడే ఈ పాట చిత్రీకరిస్తున్నామన్నారు. నిర్మాత రమణారావు బసవరాజు మాట్లాడుతూ.. దర్శకుడి వైవిధ్యమైన ఆలోచనలు ఈ చిత్రాన్ని సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారని, ఓ పాట, ఓ ఫైట్ షూట్ చేస్తే సినిమా మొత్తం పూర్తవుతుందని తెలిపారు. ఫిబ్రవరిలో ఫస్ట్‌లుక్‌ను సినిమా టైటిల్‌ను ప్రకటించి, ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. తెలుగు చిత్రసీమలో కథానాయకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉందని మిమో చక్రవర్తి తెలిపారు. కార్యక్రమంలో కథానాయకి శెషాచెత్రి, మహేష్‌మంజ్రేకర్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరాను జైపాల్ నిమ్మల, సంగీతాన్ని శేఖర్‌చంద్ర అందిస్తున్నారు.