రానా.. పర్ఫెక్ట్ ప్లానింగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్యత్‌ను బలంగా ప్లాన్ చేస్తున్నాడు టాలీవుడ్ హల్క్ -రానా దగ్గుబాటి. ప్రస్తుతం సెట్స్‌పైవున్న ‘విరాటపర్వం’ షూటింగ్ కొలిక్కి రావడంతో -తదుపరి భారీ పౌరాణిక ప్రాజెక్టుతో సెట్స్‌పైకి వెళ్లనున్నాడు. రానాను రాక్షస రాజు ‘హిరణ్య కశ్యప’గా చూపించేందుకు దర్శకుడు గుణశేఖర్ -స్క్రిప్ట్ రెడీ చేయడం తెలిసిందే. అయితే, ఆసక్తి రేకెత్తిస్తోన్న ప్రాజెక్టు కొంతకాలంగా చర్చ దశను దాటలేకపోతోంది. అయితే, ఈ సమ్మర్‌లో ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లడం ఖాయమన్నట్టే కనిపిస్తోంది. గుణశేఖర్ సినిమా అంటేనే సెట్టింగులు ఓ రేంజ్‌లో ఉంటాయి. పైగా ఇది పౌరాణిక కథాంశంతో తెరకెక్కే సినిమా కావడంతో -సెట్స్ పనులు, విఎఫ్‌ఎక్స్‌కు భారీ బడ్జెట్ తప్పదు. అయితే, -రానా మార్కెట్ స్టామినాను పక్కనపెట్టి, పాన్ ఇండియా క్యాటగిరీ బడ్జెట్ చిత్రంగా ఉండొచ్చన్న అంచనాలు లేకపోలేదు. ప్రీప్రొడక్షన్ పనుల్ని పక్కాగా పూర్తి చేసుకుని బౌండ్ స్క్రిప్ట్‌తో సిద్ధమైన చిత్రబృందం, త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఇవ్వొచ్చనీ అంటున్నారు. హిరణ్య కశ్యప ప్రాజెక్టుని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. బాహుబలి తరువాత దగ్గుబాటి రానా చేస్తున్న క్రేజీ ప్రాజెక్టు ఇది. ఆ తదుపరి ప్రాజెక్టుల్నీ రానా లాక్ చేసి పెట్టాడన్న కథనాలు వస్తున్నాయి. వాటిల్లో హాథీ మేరా సాథీ ఒకటైతే, దర్శకుడు తేజతో చేయనున్న మరో ప్రాజెక్టు. అదే ఖాయమైతే -‘నేనే రాజు నేనే మంత్రి’ తరువాత ఈ కాంబోలో వచ్చే రెండో సినిమా అవుతుందది. తేజ ప్రాజెక్టులో రానా ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేస్తే, మరో యువ హీరో కథానాయకుడిగా నటిస్తాడట. ఈ ప్రాజెక్టుకు ‘రాక్షసరాజ్యంలో రావణాసురుడు’ టైటిల్‌ని ఫిక్స్ చేశారని వినికిడి. విరాటపర్వం తరువాత హిరణ్య కశ్యప, ఆ తరువాత రానా ఏ ప్రాజెక్టును ముందుకు తెస్తాడన్నది వెండితెరపైనే చూడాలి.