ఆకట్టుకునే దండుపాళ్యం 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజాగాంధీ, రఘుముఖర్జీ ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన దండుపాళ్యం చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘దండుపాళ్యం-2’ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ, ‘దండుపాళ్యం’ తర్వాత మరో ఆసక్తికరమైన సబ్జెక్ట్‌తో చేస్తున్న ఈ సీక్వెల్‌లో నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించబోతున్నామన్నారు. చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించామని, అందరికీ నచ్చే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా ఉంటుందని అన్నారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ, గతంలో విడుదలైన ‘దండుపాళ్యం’ చిత్రం కన్నడంలోనే కాకుండా తెలుగులో కూడా ఘన విజయం సాధించిందని, దానికి సీక్వెల్‌గా రూపొందే ఈ చిత్రం దానికి రెట్టింపుగా వుంటుందని, ఇప్పటివరకు 40 రోజులపాటు షూటింగ్ జరిపి, 70 శాతం షూటింగ్‌ని పూర్తిచేశామని అన్నారు. త్వరలోనే చివరి షెడ్యూల్ ప్రారంభిస్తామని అన్నారు.