ఈ ప్రేమకేమైంది..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు వాలైంటైన్స్ డే
*
జగమంతా కుటుంబం నాది.. అన్న పాటలోనే కవి ప్రపంచాన్ని అంతా ప్రేమిస్తున్నానంటూ చెప్పాడు. ఈ లోకంలో వున్నవాళ్లందరూ నా మనుషులే అంటాడు. ప్రతిఒక్కరినీ మనిషిని మనిషిగా గౌరవిస్తానంటాడు. ఇది ప్రేమకు ఒకవైపే. తెలుగు సినిమా మాత్రం ప్రేమకు మరోవైపు చూస్తూ కథలు రాసుకుంటోంది. ప్రేమ అంటే, ఓ అమ్మాయి అబ్బాయిమధ్య జరిగే కెమికల్ రియాక్షన్ అన్నట్టు కథలు చెప్పేస్తున్నారు. రంగు, రుచి, వాసన ఏమీ లేని ప్రేమపై ఎన్నో వేల కథలు వ్రాసి కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టి చిత్రాలు రూపొందిస్తున్నారు. ఇద్దరు ముసలివాళ్ళు, వారి పిల్లలు ఉద్యోగాల నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిపోయారు. అలాంటి ఇద్దరి ముసలి భార్యాభర్తల కథ అయినా సరే అందులో రొమాన్స్ ఉండాల్సిందే అంటున్నారు సినీ కథా రచయితలు. చివరికి ప్రేమ అనే పదార్థం లేకపోతే మిగతా ఎన్ని మసాలాలు వేసినా అది రుచి పచి లేని పప్పు అయిపోతుంటారు. అలా కథలు రాయడం చాలా తప్పంటారు. అందుకోసమే ఎక్కడెక్కడినుంచో చిన్న చిన్న సంఘటనలను తీసుకొని ప్రేమకథలుగా చెక్కేస్తున్నారు. ఏదో విషయం కథలో ఉంటే ఫర్వాలేదు, కానీ ఏమీ లేకుండా నాలుగు లవ్ సీన్లు, పాటలు, లిప్‌లాక్‌లు వేసేసుకొని సినిమా చుట్టేస్తే చూడడానికి ప్రేక్షకులు ఇప్పుడు సిద్ధంగా లేరు. ఎందుకంటే, అద్భుతమైన లవ్ ఫీల్ వున్న చిత్రాలు ఎన్నో ముందు తరాల దర్శకులు అందించారు. ఆరాధన, అభినందన, నిరీక్షణ, నీరాజనం, సీతాకోకచిలుక లాంటి క్లాసికల్స్ చూసిన ప్రేక్షకులు ఇపుడు మాస్ ప్రేమకథలు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. సరే.. రోజులు మారాయి అనుకున్నా కానీ, ఎటువంటి ఫీల్ ముఖంలో కనపడని నటీనటులు ఎక్కువైపోవడంతో పిచ్చిపిచ్చి ప్రేమకథలు తెలుగు తెరను ఏలేస్తున్నాయి. గతంలో ప్రేమ భావన కథలో అంతర్లీనంగా వుంటే, ఇపుడు అశ్లీలం ప్రేమ నిండా నిండిపోయి రోత పుట్టే సన్నివేశాలను చుట్టేస్తున్నాయి. దాంతో థియేటర్‌కు వచ్చిన మరు రోజే ప్రేక్షకుని పెదవి విరుపుతో ఠాపాకట్టేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో వేల కథలను చూసిన తెలుగు ప్రేక్షకుడు ఈ సంవత్సరం కూడా మరెన్నో ప్రేమకథలను చూసే ప్రయత్నం చేశాడు. కానీ ఏదీ సరైన ఫీలింగ్ ఇవ్వలేకపోయింది. గత సంవత్సరం విడుదలైన రొమాంటిక్ చిత్రాలలో గీత గోవిందం ఒక్కటే ప్రేక్షకుల దగ్గర పాస్ మార్కులు వేయించుకుంది. ఐస్మార్ట్ శంకర్ సోసో అనిపించుకున్నాడు. దాదాపు 30, 40 సినిమాలదాకా విడుదలైనా ఏ ఒక్కటీ ప్రేక్షకుణ్ణి సంతృప్తిపరచలేకపోయింది. మన్మథుడు-2, రొమాంటిక్ క్రిమినల్స్, మజిలీ, క్రేజీ క్రేజీ ఫీలింగ్, మజ్ను, హలో గురూ ప్రేమకోసమే, లవర్, తొలిప్రేమ, ఇట్స్ మై లవ్‌స్టోరీ, కొత్తగా మా ప్రయాణం, 4 లెటర్స్, ప్రేమ ఎంత పనిచేసే నారాయణ, కాలేజీ పోరగాళ్ళు, మనసా వాచా, సూర్యకాంతం, చిత్రలహరి, సీత, రామసక్కని సీత, ప్రేమజంట, బుర్రకథ, దొరసాని, నిన్ను వీడని నీడను నేనే, డియర్ కామ్రేడ్, నేను లేను, లవర్స్ డే, మళ్లీ మళ్లీ చూశా, కొబ్బరిమట్ట, జోడీ, రాజావారు రాణిగారు, నిన్ను తలచి, 90 ఎంఎల్, ఎవరికీ చెప్పొద్దు, ఇద్దరి లోకం ఒక్కటే లాంటి చిత్రాలు గత సంవత్సరం ప్రేమ ప్రధాన అంశంగా రూపుదిద్దుకున్నాయి. ఈ ప్రేమకథల్లో అక్కడక్కడా హారర్ ఎలిమెంట్స్ కూడా కన్పిస్తాయి. దీంతో హారర్ ప్రేక్షకులను ఏ మాత్రం భయపెట్టకపోగా, లవ్ ఫీల్ కనుమరుగైపోయింది. థ్రిల్లర్‌గా రూపొందిన కొన్ని ప్రేమకథలు కూడా సరైన కథనం లేకపోవడంతో తేలిపోయాయి. దర్శక నిర్మాతలు తాము వండింది అద్భుతమైన ప్రేమకథ అని చెప్పడం రివాజైపోయింది. ప్రేక్షకుడు మాత్రం ఎప్పటికప్పుడు వస్తున్న పెద్ద సినిమాల ఆలోచనా విధానంతో డి క్లాస్ స్థాయిలో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రాలను తిప్పికొడుతున్నాడు. దానికితోడు పాత సినిమాల సన్నివేశాలు రిపీట్ అవ్వడంతో బోర్ ఫీలవుతున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు ఆవిష్కరించడంలో తెలుగు ప్రేమకథా చిత్రాలు విఫలమవుతున్నాయి. ఈ సంవత్సరమైనా ప్రేమికులకు పండగ వాతావరణం లాంటి చిత్రాలు వస్తాయని ఆశిద్దాం!