నయనాజాలం వసంతకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార మరో సస్పెన్స్ హారర్‌తో తెలుగు ఆడియన్స్ ముందుకొస్తోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకుపోతున్న సూపర్ క్రేజీ హీరోయిన్ నయన్ -‘వసంతకాలం’ చిత్రంతో మరోసారి తన నట మాయాజాలాన్ని చూపించనుందని నిర్మాత దామెర విఎస్‌ఎస్ శ్రీనివాస్ అంటున్నాడు. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా తమిళంలో ఇప్పటికే సెనే్సషన్ సృష్టించిన సినిమాను ‘వసంత కాలం’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు శ్రీనివాస్. 5 కలర్స్ మల్టీమీడియా బ్యానర్‌పై వస్తోన్న చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టాంగుడి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బిల్లా 2 ఫేమ్ చక్రి తోలేటి తెరకెక్కించిన చిత్రం నేడు థియేటర్లకు వస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్, నయన్‌కి వున్న క్రేజ్ దృష్ట్యా సినిమా తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నామని నిర్మాత శ్రీనివాస్ చెబుతున్నారు.