ఎలిఫెంట్ ఫ్రెండ్లీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవిపై మానవ పంజా -కథాంశాన్ని తీసుకుని దర్శకుడు ప్రభుసాల్మన్ తెరకెక్కిస్తోన్న చిత్రం అరణ్య. హీరో రానా దగ్గుబాటి చేస్తోన్న బహు భాషా చిత్రమిది. ‘హాథీ మేరే సాథి’గా హిందీలో, కాండన్‌లో తమిళంలోనూ రూపుదిద్దుకుంటోంది. విడుదల సమయం దగ్గర పడుతున్నకొద్దీ ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తించే అప్‌డేట్స్, పోస్టర్స్‌ను చిత్రబృందం వదులుతోంది. దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న చిత్రమిది. కొద్దిరోజుల క్రితం విడుదలైన రానా ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ రావడం తెలిసిందే. అడవికి, వన్య ప్రాణులకు పెద్దదిక్కుగా రానా మాసీ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తోన్న తమిళ నటుడు విష్ణువిశాల్ ఫస్ట్‌లుక్‌నీ కొద్దిరోజుల కిందటే విడుదల చేసినా, తాజాగా అతని పాత్ర స్వభావాన్ని తెలియజేస్తూ -ఏనుగుపై కూర్చున్న ఫ్రెండ్లీ లుక్‌ని విడుదల చేశారు. విష్ణు పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఏప్రిల్ 2న అన్ని భాషల్లో ఏకకాలంలో సినిమా విడుదల కానుంది.