ఫిట్నెస్ హిట్టు ప్లానింగ్ ఫట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత గ్లామరున్నా సరైన హిట్ లేకపోతే కెరీర్ సున్నా. హిట్‌లేని హీరోయిన్ ఛాయల్లో ఏ నిర్మాత, దర్శకుడూ కనిపించడు. హిట్ పడ్డాక సరైన ప్లానింగ్ లేకపోయినా కెరీర్‌ని ముందుకు తీసుకెళ్లడం కష్టమే. అలా ఫెయిలైన హీరోయిన్ల జాబితాలో తాజాగా నిధి అగర్వాల్ పేరు వినిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ హిట్టు పడటంతో నిధికి అవకాశాలు వరుస కట్టడం ఖాయమనే అనుకున్నారు. అయితే, సరైన ప్లానింగ్ లేకపోవడంతో డెబ్యూ హీరోతో జతకట్టాల్సిన పరిస్థితి నిధికి వచ్చింది. ప్రుస్తతం చేస్తన్న సినిమా నిధి కెరీర్‌కు ఎంతమాత్రం ప్లస్ కాదంటున్నారు. తనతోపాటు వచ్చిన నభానటేష్ మంచి ప్లానింగ్‌తో అవకాశాలు అందుకుంటోంది. నిధి మాత్రం మహేష్ మేనల్లుడిగా పరిచయమవుతున్న కుర్ర హీరోతో సినిమా చేస్తుంది. ప్రాజెక్టు వర్కౌటైతే ఓకే. లేదంటే నిధి కెరీర్ మరింత వెనక్కిళ్లినట్టే.