దర్శకులకు అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్ బ్యానర్లపై దర్శకుడు బాలు అడుసుమిల్లి తెరకెక్కించిన చిత్రం -అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి. హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మాతలు. ధన్య బాలకృష్ణ, త్రిధాచౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్ విడుదల చేసిన చిత్రబృందం -మార్చి 6న సినిమాను థియేటర్లకు తెస్తున్నట్టు ప్రకటించింది. కార్యక్రమంలో ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ -కెరీర్‌లో నేను చేసిన ప్రయోగాత్మక సినిమా ఇది. చాలా ఎగ్జైట్ అవుతున్నా. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ధన్య పాత్రలో కనిపిస్తా అన్నారు. సిద్ధీ ఇద్నాని మాట్లాడుతూ -బాల్య స్నేహితులైన నలుగురు అమ్మాయిల వినోదాత్మక కథ ఇది. థియేటర్లలో హాయిగా నవ్వించే సినిమాను ఎంజాయ్ చేయండి అన్నారు. త్రిధాచౌదరి మాట్లాడుతూ -సోలో హీరోయిన్‌గా ఇప్పటికే సినిమాలు చేశాను. బట్, ముగ్గురు హీరోయిన్లతో కలిసి చేయడం తమాషాగా అనిపిస్తోంపి. ఈ సినిమాకు మేమే ‘షీరోస్’. వైవిధ్యమైన ప్రాజెక్టులో భాగమైనందుకు హ్యాపీగా ఉంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేయండి అన్నారు. కోమలి ప్రసాద్ మాట్లాడుతూ -హీరోయిన్‌గా నా రెండో సినిమా ఇది. వినోదం కోసం థియేటర్‌కు వచ్చే ఆడియన్స్‌ని రెండు గంటలపాటు పడిపడి నవ్వించే సినిమా. రెండోసారి, మూడోసారి.. ఎన్నిసార్లైనా చూడతగ్గ సినిమా మీ ముందుకొస్తోంది అన్నారు. దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ -చాలాకాలంపాటు మీడియాలో భాగంగా మీడియా సభ్యుల మధ్యనున్నా. అక్కడి నుంచి దర్శకుడి స్థానానికి రావడం పెద్ద స్టెప్. అందులో ఎంత పెయిన్‌వుందో అనుభవపూర్వకంగా అర్థమైంది. దర్శకులైనవాళ్లంతా అలాంటి పెయన్ చూసినోళ్లే అనుకుంటా. అందుకే, దర్శకులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నా. వినోదంతో కూడిన మంచి సినిమా తీశా. నా భార్య హిమబిందు నిర్మాతగా మారి ఎంతో సపోర్ట్ చేశారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాం. ఆడియన్స్ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా అన్నారు. నిర్మాత హిమబిందు వెలగపూడి మాట్లాడుతూ -బాలు దర్శకుడవుతాడని చెప్పినపుడు షాకయ్యా. కథ విన్న తరువాత ట్రై చేయమన్నాను. తరువాత మేమే సినిమా నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చాం. రఘురామ్, శ్రీరామ్ ఎంతో సపోర్ట్ చేశారు. మంచి సినిమాను ఎంజాయ్ చేయండి అన్నారు. ఈ సినిమాకు శేఖర్ గంగమోని సినిమాటోగ్రఫీ, వికాస్ బాడిస సంగీతం సమకూర్చారు.