పవన’వేగంతో.. !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండేళ్ల గ్యాప్ తీసుకున్నా -రీఎంట్రీలోనే పవన’వేగం చూపిస్తున్నాడు కల్యాణ్. పాలిటిక్స్‌ని బ్యాలెన్స్ చేస్తూనే -ప్రొఫెషనల్ కెరీరిజంపై సీరియస్ ఫోకస్ పెట్టినట్టే కనిపిస్తోంది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలకు నాలుగేళ్ల టైంవుంది కనుక -రెండేళ్లు సినిమాలకు కేటాయించి.. రాజకీయాలను నడిపించే కనీస ఆర్థిక సామర్థ్యం సమకూర్చుకోవాలన్న యోచనతో ఉన్నట్టు పవన్ చెప్పకనే చెబుతున్నాడు. ఇప్పటికే సెట్ అయిన మూడు ప్రాజెక్టుల్ని ఏడాదిలో పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించుకున్న పవన్.. తరువాతి కాలంలో పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులనూ ఇప్పటినుంచే సెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం చేస్తున్న ‘పింక్’ రీమేక్‌లో తన పాత్రను దాదాపుగా ఫినిష్ చేసేశాడు. తరువాత క్రిష్ డైరెక్షన్‌లో విరూపాక్ష (వినిపిస్తున్న టైటిల్)తో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. ఆపై దర్శకుడు హరీష్ శంకర్‌తో మరో ప్రాజెక్టూ సెట్టైపోయి ఉంది. ఇవికాక -నాలుగు, ఐదు ప్రాజెక్టులపైనా పవన్‌కల్యాణ్ తనదైన విజన్‌తోనే ఉన్నాడన్న టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. వాటిలో -త్రివిక్రమ్‌తో ఒక ప్రాజెక్టు ఉండొచ్చన్న కథనాలు లేకపోలేదు. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయబోయే ప్రాజెక్టు అప్పటికి పూర్తిచేసేసి -తదుపరి పవన్ ప్రాజెక్టుకు త్రివిక్రమ్ రావొచ్చన్న మాట వినిపిస్తోంది. త్రివిక్రమ్ తరువాత పవన్ -పూరితో సినిమా చేయొచ్చన్నది తాజా టాక్. పవన్‌కు డిఫరెంట్ స్టయిల్ క్రియేట్ చేసిన సినిమా ‘బద్రి’. అది -పూరి క్రియేటివ్ థాట్. తరువాత ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’లాంటి ప్లాప్‌నిచ్చినా.. బద్రి ఇమేజ్‌ను అదెంతమాత్రం డామేజ్ చేయలేదన్న భావన పవన్‌లో లేకపోలేదు. సినిమా ఫ్లాప్‌తో పవన్-పూరి కాంబోలో ఇకపై సినిమా వచ్చే అవకాశమే లేదన్న మాట వినిపించింది. అయితే పవన్‌తో సినిమా చేసేదిలేదంటూ నాపై వస్తోన్న కథనాల్లో వాస్తవం లేదంటూ పూరి క్లారిటీ ఇచ్చినా -పవన్‌తో మాత్రం ప్రాజెక్టు పడలేదు. తరువాత వరుస ఫ్లాపులతో సతమతమైన పూరి ఇప్పుడు నిలదొక్కుకోవడం, పవన్‌తో సినిమా చేస్తే కెరీర్ ఇమేజ్ పెరిగే అవకాశమున్న నేపథ్యంలో -ప్రాజెక్టు చేసే అవకాశమే వస్తే పూరి వదులుకోడన్నది నిజం. ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణమైన ‘బద్రి’ని డిజైన్ చేయడానికీ కసితో పనిచేస్తాడు. ఇస్మార్ట్ శంకర్‌తో హిట్టందుకున్న పూరి -ప్రస్తుతం విజయ్ దేవరకొండను పైకిలేపే ప్రయత్నాల్లో ఉన్నాడు. పూరి చేస్తున్న ‘ఫైటర్’కు హిట్టుపడితే, పవన్ ఫోర్త్ ప్రాజెక్టుకే డైరెక్టర్‌గా పూరి పేరు వినిపించొచ్చు. ఏదేమైనా పవన్ స్పీడ్ చూస్తుంటే రెండేళ్ల గ్యాప్‌లో ఐదారు ప్రాజెక్టులు పూర్తి చేసేలాగే కనిపిస్తోంది.