ఫైట్‌తో స్టార్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహా, లెజెండ్ తరువాత బా.బో కాంబోలో వస్తోన్న భారీ చిత్రం -మంగళవారం సెట్స్‌పైకి వచ్చింది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రమిది. ఫైట్‌మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్‌లో బాలకృష్ణ పాల్గొంటే, బోయపాటి శీను షూట్ చేశారు. ఈ కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రాయలసీమ కుర్రాడిగాను, అఘోర పాత్రలోనూ బాలకృష్ణ కనిపించనున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. వారణాసి నేపథ్యంగా వచ్చే ఎపిసోడ్‌లో బాలయ్య అఘోరగా కనిపిస్తాడని, గంభీరమైన పాత్రకు డైలాగులు తక్కువన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్య కెరీర్‌లో అతి తక్కువ డైలాగులతో చేసే పాత్ర ఇదే కావొచ్చనీ అంటున్నారు. బాలయ్యకు జోడీగా శ్రీయ, అంజలి కనిపించనున్న సంగతి తెలిసిందే.