మళ్లీ.. అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దైవం మానుష్య రూపేణా -అంటూ మొదలైన నిఖిల్ కొత్త ప్రాజెక్టు ఆసక్తి రేకెత్తిస్తోంది. నిఖిల్ -చందుమొండేటి కాంబోలో వచ్చిన ప్రాజెక్టు కార్తికేయ సెనే్సషన్ సృష్టించటంతో -చాలాకాలంగా అనుకుంటోన్న సీక్వెల్ కార్తికేయ -2ని తిరుపతి వెంకన్న సన్నిధిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, ఆయన తనయుడు అభినయ రెడ్డి హీరో నిఖిల్‌పై క్లాప్‌కొట్టి షూటింగ్ ప్రారంభించారు. దర్శకుడు చందుమొండేటి, నిర్మాతలు టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల చిత్ర యూనిట్ కార్యక్రమంలో పాల్గొంది. హీరో నిఖిల్ మాట్లాడుతూ -యానిమల్ హిప్నాటిజం కానె్సప్ట్‌తో కార్తికేయ ఎలాంటి సెనే్సషన్ సృష్టించిందో చెప్పాల్సిన పని లేదు. చాలాకాలం తరువాత కార్తికేయ-2 మొదలవ్వడం ఎగ్జైటింగ్‌గా ఉంది. భారయతీ సంప్రదాయాన్ని అద్భుతంగా చూపెట్టనున్న చిత్రాన్ని ఉగాది తరువాత రెగ్యులర్ షూట్ మొదలెడతాం. సాధ్యమైనంత త్వరగా సినిమా పూర్తిచేసే ప్రణాళికతో ఉన్నామన్నాడు. ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ -ద్వాపరయుగంలోని కృష్ణుని చుట్టూ అల్లుకున్న కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు మేకర్లు చెప్పినపుడు సంతోషమేసింది. గతంలో కార్తికేయను ఆదరించినట్టే సీక్వెల్ సైతం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకముంది అన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న కార్తికేయ 2 కానె్సప్ట్‌కు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 5118 ఏళ్ల క్రితం ద్వాపరయుగానికి సంబంధించిన దైవ జ్ఞాన రహస్యం. ఈ యుగంలో దానిని తెలుసుకోవడానికి సాగించే అనే్వషణ. స్వార్ధానికి ఒకరు. సాధించానికి ఒకరు. మంచి సంకల్పానికి సాయం చేసిందెవరు? అంటూ సాగిన కానె్సప్ట్ టీజర్ -కథా వస్తువుపై ఆసక్తి రేకెత్తిస్తోంది.