చాన్స్‌లు కాలాక..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందంకన్నా అభినయమే మిన్న -అన్న చిత్రోక్తిని ఒకింత ఆలస్యంగా అర్థం చేసుకున్నట్టుంది రకుల్‌ప్రీత్. అందంకంటే అభినయానికి ప్రాధాన్యమంటూ -ముందుతరం హీరోయిన్లు ఎందుకు చెప్పేవారో ఇప్పుడు అర్థమైనట్టుంది ఈ పంజాబీ బ్యూటీకి. స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చేసినా -ఒకేతరహా గ్లామర్ రోల్స్ ఏకబిగిన చేయడం వల్లే కెరీర్ కొంపమునిగిందన్న గ్రహింపుకొచ్చిందట ఈ జిమ్ ఫ్రీక్ బ్యూటీ. తనతోపాటు స్క్రీన్ కెరీర్ మొదలెట్టిన మిగితా హీరోయిన్లతో పోలిస్తే, రకుల్ చాలా వేగంగానే ఎదిగింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కాకపోతే, అంతే వేగంగా కనుమరుగైంది. ఎన్ని ట్రిక్స్ ప్లే చేస్తున్నా -రకుల్‌కి పిలిచ్చి చాన్సిచ్చేవాళ్లే కనిపించటం లేదు. అదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ -వరుసగా గ్లామర్ రోల్స్‌ చేసి అందాలను ఆరబోయటమే కెరీర్‌కు చేటొచ్చింది. నటనకు ఆస్కారమున్న పాత్రలపై దృష్టి పెట్టలేకపోయా -నన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది రకుల్. బోల్డ్ గ్లామర్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎంత తప్పో -చాన్స్‌లు కాలాక అర్థమైందన్నది రకుల్ మాట. నిర్మాతలకు అనుకూలమైన హీరోయిన్‌ని, పంక్చ్యువాలిటీ నన్ను చూసే నేర్చుకోవాలి -లాంటి కబుర్లెన్ని చెబుతున్నా రకుల్‌కు మళ్లీ టాలీవుడ్‌లో ఆ ప్లేస్, స్పేస్ దొరకడం కష్టమనే అంటున్నారు.