గర్వపడుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్షిత్, నక్షత్ర జోడీగా కొత్త దర్శకుడు కరుణకుమార్ తెరకెక్కించిన చిత్రం -పలాస 1978. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమర్పకుడు భరద్వాజ, నిర్మాత అట్లూరి వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. భరద్వాజ మాట్లాడుతూ -పలాస కథను దర్శకుడు చెప్పినపుడు నచ్చి హీరోకి రిఫర్ చేశాను. మాభూమి తరువాత ఆ స్థాయిలో ఉండే సినిమా ఇది. నిర్మాత ప్రసాద్ ధైర్యంగా సినిమా మొదలెట్టారు. మంచి సినిమాలో నేను భాగమైనందుకు హ్యాపీగా, గర్వంగా ఉంది. నేను చేసిన అనేక సినిమాలో ఇది ప్రత్యేకమనే చెబుతాను. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్టు తీశాడు. అల్లు అరవింద్, మారుతి, బన్నీవాస్ సినిమా చూసి మెచ్చుకున్నారు. ఈ సినిమా చూశాక దర్శకుడు కరుణకుమార్‌కు అల్లు అరవింద్ తన సంస్థలో అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. దర్శకుడు ఓ మంచి కథను తెరకెక్కించాడని నమ్మకంగా చెబుతున్నా అన్నారు. నిర్మాత వరప్రసాద్ మాట్లాడుతూ -సినిమా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని బయటకు వచ్చింది. అన్ని విషయాల్లో తమ్మారెడ్డి వెనకుండి నడిపించారు. కొత్త ఆర్టిస్టులతో సినిమా చేయడం నాకు ఛాలెంజింగ్ అనిపించింది. ఒక గ్రామంలోని యథార్థ ఘటనలను నలిగిపోయిన జీవితాల కథగా పలాసలో బలంగా చూపించాం. నిర్మాతగా నాకు సంతృప్తినిచ్చిన చిత్రం -పలాస 1978 అన్నారు.