నిఖిల్.. బన్నీవాస్ కాంబోలో ...18 పేజీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ ఇంటి వాడయ్యేందుకు రెడీ అవుతూనే -హీరో నిఖిల్ వరుస సినిమాలతోనూ బిజీ అవుతున్నారు. కెరీర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన టైంలో -అర్జున్ సురవరం చేసి కాస్త ఊపిరి తీసుకున్న నిఖిల్.. తనకు మంచి ఇమేజ్ తెచ్చిన ‘కార్తికేయ’కు సీక్వెల్ మొదలు పెట్టడం తెలిసిందే. దర్శకుడు చందు మొండేటి సిద్ధం చేసిన ‘ద్వారపరియుగం నాటి విజ్ఞాన రహస్యాన్ని వెలికి తీయనున్న సాహసి’లా కార్తికేయ-2లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. చందు సిద్ధం చేసిన వైవిధ్యమైన థ్రిల్లర్ స్టోరీని సెట్స్‌పైకి తీసుకెళ్లే బిజీలోనే -మరో ప్రాజెక్టునీ లాంఛనంగా మొదలెట్టేశాడు. కుమారి ఎఫ్21తో ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ -నిఖిల్ హీరోగా ‘18పేజెస్’ ప్రాజెక్టుని తెరకెక్కించనున్నాడు. జిఏ2 పిక్చర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో నిర్మాత బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. గురువారం ఫిల్మ్‌నగర్ టెంపుల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో అల్లు అర్జున్ కుమార్తె అర్హ క్లాప్‌కొట్టగా, నిర్మాత బన్నీ వాసు కుమార్తె హన్విక కెమెరా స్విచాన్ చేసింది. కథ, స్క్రీన్‌ప్లే అందిస్తోన్న సుకుమార్ తొలి షాట్‌కి గౌరవ దర్వకత్వం వహించాడు. కుమార్ ఎఫ్21 సక్సెస్ కావడంతో -టైటిల్లో నెంబర్ సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తూ ప్రాజెక్టుకి 18 పేజెస్ టైటిల్ కన్ఫర్మ్ చేశారు.