క్రాక్.. జయమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిస్కోరాజా ఎదురు దెబ్బ తరువాత హీరో రవితేజ కసిగా చేస్తున్న సినిమా -క్రాక్. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న చిత్రంలో రవితేజతో శృతిహాసన్ రొమాన్ చేయనుంది. సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తోన్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను జయమ్మగా పరిచయం చేస్తూ -పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. వరలక్ష్మి ఇంటెన్స్ లుక్ చూస్తుంటే -గ్రామీణ నేపథ్యంలో ప్రతినాయిక పాత్ర పోషిస్తున్నట్టు కనిపిస్తోంది. విలనిజానికి తనదైన స్టయిల్‌ను జోడించి పాత్రల్ని పండిస్తోన్న ఈ బ్యూటీ -క్రాక్‌లోనూ తన పాత్రతో పిచ్చెక్కించనుందని చిత్రబృందం అంటోంది. క్రాక్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న రవితేజ -ఈ ప్రాజెక్టుతో సక్సెస్ కొడతానన్న ధీమాతో ఉన్నాడు. తమన్ సంగీతం సమకూరుస్తున్న చిత్రం మే 8న థియేటర్లకు రానుంది.