పలాసలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్షిత్, నక్షత్ర జోడీగా కరుణకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం -పలాస 1978. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన చిత్రానికి థియేటర్ల వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన థాంక్స్ మీట్‌లో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ -దళితుల పాత్రలతో సినిమాలు రావడం లేదంటారు. అలా వచ్చిన పలాస 1978ని మాత్రం పట్టించుకోవడం లేదు. పలాసలో దళితుల పాత్రలనే హీరోలు చేశాం. వారి సమస్యలు చర్చించాం. వాళ్లే స్పందించకుంటే ఎలా? వాళ్ల సినిమాను వాళ్లే బతికించుకోవాలి. నా 40ఏళ్ల కెరీర్‌లో ఏ సినిమా ఆడకున్నా బాధ పడలేదు. కానీ, పలాసలాంటి సినిమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది అన్నారు. దర్శకుడు కరుణకుమార్ మాట్లాడుతూ -పలాస విజయం నాకు మరిన్ని సినిమాలు చేయడానికి ధైర్యాన్నిస్తోంది. ఈ సినిమా మరింత విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నా అన్నారు. రఘు కుంచె మాట్లాడుతూ -నిర్మాత ప్రయత్నం, దర్శకుడు ఆలోచన సినిమాను నిలబెట్టాయి. ఆర్టిస్టులంతా అద్భుతంగా చేశారు. చిన్న సినిమా పలాసకు పెద్ద విజయం అందించిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు. హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ -పలాసలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి చిత్రంలో భాగమైంనందుకు హ్యాపీగా ఉంది. సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లమని కోరుతున్నా అన్నారు. హీరో రక్షిత్ మాట్లాడుతూ -క్రిటిక్స్ నుంచి మంచి సమీక్షలు రావడమే సినిమాకు పెద్ద విజయం. సినిమాలోని ప్రతి సీన్ గురించి మాట్లాడుకోవడం వింటుంటే హ్యాపీగా ఉంది అన్నారు.