నిధికి కలిసొచ్చేనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు -రవితేజకు జోడీగా చేసిన హీరోన్లకు మంచి ఎలివేషన్ ఉండేది. ప్రస్తుతం రవితేజ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తుండటంతో -ఆ ప్రాజెక్టుల్లో చేసిన హీరోయిన్ల కెరీర్‌కు ఏమాత్రం లాభం చేకూరడం లేదు. సో, రవితేజతో జోడీ కట్టనున్న ఇస్మార్ట్ భామ నిధి అయినా ఈ పరిస్థితిని బ్రేక్ చేస్తుందేమో చూడాలి. రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. తదుపరి ప్రాజెక్టునూ ఇప్పటికే లైన్‌లో పెట్టాడు. గతేడాది ‘రాక్షసుడు’ రీమేక్‌తో మంచి హిట్టుకొట్టిన రమేష్ వర్మ -ఈసారి తమిళ హిట్టు ‘శతురంగ వెట్టై’ని రవితేజతో రీమేక్ చేయనున్నాడు. రవితేజ -రమేష్‌వర్మ కాంబోలో రానున్న ప్రాజెక్టుకు హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్టు వార్తలొస్తున్నాయి. గతంలో రవితేజకు జోడీగా చాన్స్ వస్తే -ఆ హీరోయిన్ రొట్టెవిరిగి నేతిలో పడినట్టే అన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రవితేజకే సరైన హిట్టులేని పరిస్థితుల్లో.. జోడీగా నటించిన హీరోయిన్లకూ గొప్ప బ్రేక్ రావడం లేదు. ప్రస్తుతం నిధి అగర్వాల్ కెరీర్ కూడా అంత స్పీడ్‌గా లేదు. ఇస్మార్ట్.. తరువాత వరుస చాన్స్‌లు రావొచ్చని అనుకున్నా -అలాంటి సీన్ కనిపించలేదు. సీనియర్ హీరో రవితేజకు జోడీగా చాన్స్ రావడంతో -ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట కుర్ర బ్యూటీ. అయితే, ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ అనిపించుకుంటుందా? అన్న చర్చ మొదలైంది ఇండస్ట్రీలో. రమేష్‌వర్మ చేస్తున్న రీమేక్ కనుక వర్కౌటైతే -రవితేజతోపాటు నిధి కెరీర్‌కూ మేలు జరగడం ఖాయం.