ఆర్జీవీ.. డ్రాగన్ గాళ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రూస్లీ హీరోగా వచ్చిన -ఎంటర్ ది డ్రాగన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ వేరు. బ్రూస్లీని అమితంగా ఇష్టపడే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ -ఈ ప్రపంచానికి డ్రాగాన్ గాళ్‌ను పరిచయం చేయబోతున్నాడు. భారత్‌లోనే పూర్తి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా తెరకెక్కుతోన్న తొలి సినిమా -ఎంటర్ ది గాళ్ డ్రాగన్ అంటున్నాడు ఆర్జీవీ. అంతా ఒకటైపు.. నేనొక టైపు అనిపించుకునే వర్మ -మార్షల్ ఆర్ట్స్‌కు గ్లామర్‌ను మేళవించి చేస్తోన్న సరికొత్త ప్రయోగమిది. ఇండో చైనీస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఆర్జీవీ -ఎంటర్ ది గాళ్ డ్రాగన్‌లో టైటిల్ రోల్‌ను పూజా భలేకర్ పోషిస్తోంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోన్న ప్రాజెక్టులో -పూజా చేసిన రిస్కీ ఫైట్స్ ఆసక్తికరంగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. యాక్షన్స్ సీన్స్ మాటెమోగానీ, ఆర్టీసీ రిలీజ్ చేసిన పిక్స్‌లో పూజ అందాలు మాత్రం ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్రం ట్రైలర్ ట్రెండింగ్‌గా మారింది. గతంలో చైనాలోనూ మేజర్ షెడ్యూల్ జరుపుకున్న చిత్రం తాజా షెడ్యూల్ వైజాగ్ బీచ్‌లో జరుపుకుంటోంది. జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయనున్నారట.