వెరైటీగా.. పసివాడి ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు వంశీ, ఇతి ఆచార్య జోడీగా ధన్‌శ్రీ ఆర్ట్స్ పతాకంపై దర్శకుడు ఎన్‌ఎస్ మూర్తి తెరకెక్కిస్తోన్న చిత్రం -పసివాడి ప్రాణం. ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ ఆడియోను దర్శకుడు వివి వినాయక్, ఏ కోదండరామిరెడ్డి, నిర్మాత రాజ్ కందకూరి సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మూర్తి మాట్లాడుతూ -టాలీవుడ్‌లో ఇంతవరకూ రానటువంటి వినూత్నమైన లైవ్ కమ్ యానిమేషన్ చిత్రమిది. మోషన్ క్యాప్చర్, యానిమేషన్, గ్రాఫిక్ టెక్నాలజీతో 3డి, 2డి ఫిగర్స్, నటీనటులతో సినిమా రూపొందించటమే దీని ప్రత్యేకత. ఈ సినిమాలో కీలకంగా 2డి బేబి, 3డి టెడ్డీబేర్ అందరినీ అలరిస్తుంది. చిరంజీవి హిట్టు సినిమా టైటిల్ మాకు దొరకడం మాకు ప్లస్ పాయింట్. చిరంజీవి పసివాడి ప్రాణంలో నటించిన సుజిత ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తోంది. సినిమాకు కథ ప్రాణమైతే, ఊపిరి సీజీ వర్క్. ప్రత్యేకమైన ఈ సినిమా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.