హిట్ -2పై వర్క్ చేస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో నాని సమర్పణలో వాల్‌పోస్టర్ బ్యానర్‌పై విశ్వక్సేన్ హీరోగా రూపొందిన చిత్రం -హిట్. ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాతగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రమిది. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 28న విడుదలైన సినిమాకు మంచి టాక్ రావడంతో -దర్శకుడు శైలేష్ కొలను మీడియాతో మాట్లాడాడు. ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీశానో అది ఆడియన్స్‌ని కరెక్ట్‌గా రీచైంది. హానెస్ట్ థ్రిల్లర్‌ను డిఫరెంట్‌గా తీశానంటూ వస్తోన్న అప్లాజ్ కొత్త ఉత్సాహాన్నిస్తోంది. మంచి కథలు చెప్పాలన్న ఆలోచన, ఆశ మొదటి నుంచీ ఉంది కనుక.. డిఫరెంట్ స్టోరీస్‌నే తెరకెక్కించే ప్రయత్నం చేస్తన్నా. ఈ నగరానికి ఏమైంది సినిమా చూసినప్పటి నుంచీ విశ్వక్సేన్ నా మైండ్‌లో ఉన్నాడు. తన పెర్ఫార్మెన్స్‌లో ఇంటెన్స్ చూసి -ఈ కథకు ఎంపిక చేసుకున్నా. ఇప్పుడు రెస్పాన్స్ చూస్తుంటే పాత్రకు పూర్తి న్యాయం చేశాడనిపిస్తోంది. నిజానికి ‘హిట్’కి ఇన్‌స్పిరేషన్ అంటూ ఏమీ లేదు. థ్రిల్లర్ సబ్జెక్టు రాయలని అనుకున్న తరువాత -ప్రపంచంలోని క్రైమ్ ఘటనలని వార్తా పత్రికల్లో చదివేవాడిని. ఆసక్తికరమైన కేసుల్ని డైరీలో రాసుకుంటూ -కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌ని తీసుకుని అల్లుకున్న కథ హిట్. కమల్‌హాసన్ చేసిన హేరామ్ సినిమా -ఈ ఫీల్డ్‌కి రావడానికి నాకు ఇన్‌స్పిరేషన్. సెకెండ్ ప్రాజెక్టు విషయంలో భయం కంటే బాధ్యత ఎక్కువ ఉందనిపిస్తుంది. ఫస్ట్ ప్రాజెక్టు బాగా చేశానన్న పేరొచ్చింది కనుక, సెకెండ్ ప్రాజెక్టుపై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వాటిని నిలబెట్టుకోవాలి. ఫలానా జోనర్ సినిమాలే చేయాలన్న నియమాలేవీ లేవు నాకు. నా దగ్గర నాలుగు బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అవన్నీ వేర్వేరు జోనర్స్. ప్రస్తుతం హిట్ -కేస్2పై వర్క్ చేస్తున్నాం. సేమ్ టీమ్‌తోనే వర్క్ చేయబోతున్నా. మరికొన్ని పాత్రలు కథలో చేరతాయి. 2021లో చిత్రాన్ని విడుదల చేస్తాం. మే చివర లేదా జూన్‌లో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలనుకుంటున్నాం. నానికి నేను ఫ్యాన్‌ని కనుక, ఆయనకు సరిపడా కథ సిద్ధం చేసుకోగలిగితే ఆయనతోనూ సినిమా చేస్తా అన్నాడు.