వెరైటీ టైటిల్‌తో ఎలైట్ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జోడీగా ఎలైట్ ఎంటర్‌టైనె్మంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న చిత్రానికి -ఎస్‌ఆర్ కల్యాణ మండపం.. ఇఎస్‌టి 1975 టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాయలసీమ నేపథ్యంగా.. ఒక కల్యాణ మండపం చుట్టూ తిరిగే కథతో వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు శ్రీధర్ ఈ సందర్భంగా వెల్లడించాడు. రాయలసీమ మాండలికం, వ్యవహార శైలిలో సాయికుమార్ పోషిస్తోన్న తండ్రి పాత్ర ఆడియన్స్‌కి బలంగా కనెక్టవుతుందని దర్శకుడు అంటున్నాడు. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని ఆసక్తికరంగా చూపించే కథగా చిత్రబృందం చెబుతోంది. మొదటి షెడ్యూల్ శరవేగంగా పూర్తవుతోందని, 13నుంచి రాజంపేటలోని అన్నమాచార్య కాలేజీలో షూటింగ్ నిర్వహిస్తామని ఎలైట్ టీం వెల్లడించింది. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం, విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.